
తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పని చేసే తల్లులు దీన్ని కొనసాగించడంలో విపరీతమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ప్రసూతి సెలవులు తక్కువగా ఉండడం, కార్యాలయాల పని వేళలు, అక్కడి విధానాలు పిల్లలకు పట్టించే విధానాన్ని కష్టతరం చేస్తోంది. దానికి తోడు సామాజిక నిబంధనలు, పని కారణంగా ఇతర కారణాల వల్ల తల్లిపాలను తొందరగా ఆపేయాల్సి వస్తుంది. ఇది క్రమంగా వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పని చేసే తల్లుల శారీరక, మానసిక ఆరోగ్యానికి పాలివ్వడానికి వర్క్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలి.. ఎలాంటి అవగాహన కలిగి ఉండాలన్న విషయాలపై Aster CMI హాస్పిటల్ లో ప్రసూతి & గైనకాలజీ విభాగంలో లీడ్ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తోన్న డాక్టర్ సప్నా లుల్లా కొన్ని సూచనలిచ్చారు. పాలిచ్చే తల్లుల కోసం కొన్ని సులభమైన అడాప్ట్ చిట్కాలను లిస్ట్ ఔట్ చేసి చెప్పారు.
- తల్లిపాల కోసం ఓ షెడ్యూల్‌ను సెటప్ చేయండి.
- పనికి బయలుదేరే ముందు, పని నుంచి వచ్చిన వెంటనే మీ బిడ్డకు ఆహారం ఇవ్వండి. మీరు పని నుండి తిరిగి వచ్చే సమయంలో శిశువుకు ఆహారం ఇవ్వవద్దని మీ పిల్లల్ని చూసుకునే వారికి చెప్పి ఉంచండి.
- బాటిల్ ద్వారా రొమ్ము పాలు ఇవ్వడం మీ బిడ్డకు అలవాటు చేయండి. పని నుంచి తిరిగే వచ్చే కంటే ముందు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు సెషన్‌లల్లో వారికి ఏదైనా తినిపించమని సిఫార్సు చేయండి.
- సురక్షితమైన మందులు, పాల నిల్వ, వర్క్ బ్యాలెన్సింగ్, తల్లిపాలను గురించి మీకు మీరే అవగాహన కల్పించుకోండి.
- మీరు పని చేసే స్థలంలో పాలు ఇవ్వడానికి ప్రత్యేక స్థలం లేదా సంస్థలో సౌకర్యవంతమైన పని విధానం ఉంటే, వారు చనుబాలివ్వడానికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంటే ముందుగానే యాజమాన్యాన్ని అడగండి. పని గంటలలో చనుబాలివ్వడం, విరామాల గురించి మీ యజమానితో మాట్లాడండి.
- కార్యాలయానికి సమీపంలో పిల్లల సంరక్షణ/క్రెచ్ కోసం సెర్చ్ చేయండి. ఇది మీ బిడ్డకు వర్క్ మధ్యలో ఆహారం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
- పిల్లలకు పాలు పట్టేందుకు సాధారణ బ్రీస్ట్ పంపులకు బదులుగా ధరించగలిగే పంపులను ఉపయోగించండి. ఇవి యూజర్ ఫ్రెండ్లీ, పనిలో తక్కువ అవాంతరంతో ఉపయోగించవచ్చు.
- రోజంతా బాగా హైడ్రేటెడ్ గా ఉండండి.
తల్లి పాలివ్వడం అనేది మహిళ జీవితంలోనే అత్యంత సంతోషకరమైన, మధురమైన అనుభవం. అంతే కాదు ఇది జీవితాంతం తల్లి, బిడ్డల మధ్య బంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రారంభంలో సవాలుగా కనిపించినప్పటికీ, ఓపిక, ప్రాక్టీస్ తో తల్లిపాలను పట్టడం కొనసాగిస్తూనే.. వర్క్ లైఫ్ నూ ఎంజాయ్ చేయవచ్చు.