
హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థలలో ఒకటైన శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ గ్రూప్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా వరల్డ్ చెస్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజును నియమించుకుంది. ఈ సందర్భంగా శ్రీచైతన్య గ్రూప్ సీఈవో, డైరెక్టర్ సుష్మ బొప్పన మాట్లాడారు. ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. చిన్న వయసులోనే ఆయన సాధించిన విజయాలు స్కూల్ విద్యార్థుల నుంచి నీట్, జేఈఈ అభ్యర్థుల వరకు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు.
గుకేష్ స్ఫూర్తితో శ్రీచైతన్య స్టూడెంట్లు ఆత్మవిశ్వాసం, వ్యూహాత్మకంగా ఆలోచించి అత్యున్నత శిఖరాలను చేరుకునే సామర్థ్యాలను అలవర్చుకుంటారని పేర్కొన్నారు. అనంతరం గుకేష్ దొమ్మరాజు మాట్లాడారు. చెస్, పోటీ పరీక్షలలో విజయం వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. చెస్‌లో ముందస్తు ప్రణాళిక అవసరమైతే, జేఈఈ, నీట్ లో విశ్లేషణాత్మక విధానం తప్పనిసరని వెల్లడించారు.