తెలంగాణ అభివృద్ధికి మీ ప్రణాళికలు భేష్ .. సీఎం రేవంత్​ రెడ్డిని ప్రశంసిస్తూ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం లేఖ

తెలంగాణ అభివృద్ధికి  మీ ప్రణాళికలు భేష్ .. సీఎం రేవంత్​ రెడ్డిని ప్రశంసిస్తూ వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం లేఖ

హైదరాబాద్, వెలుగు: రానున్న పదేండ్లలో తెలం గాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిది ద్దాలన్న మీ దార్శనికత, మీ ప్రణాళికలు భేష్’’ అంటూ సీఎం రేవంత్​ని వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం ప్రశంసించింది. ఈ మేరకు సీఎంకు ఫోరం అధ్యక్షుడు బోర్జ్ బ్రెండె, మేనేజింగ్ డైరెక్టర్ మిరెక్ డూసెక్  లేఖ రాశారు. దావోస్ సదస్సులో పాల్గొని క్రియాశీలక భాగస్వామిగా నిలిచారని అభినందించారు. ‘‘మీ రైజింగ్​ తెలంగాణ 2050.. నినాదం అందరినీ ఆకట్టుకుంది. 2047 కల్లా స్టేట్  నెట్​జీరో,  హైదరాబాద్​ను దేశంలో మొదటి నెట్​ జీరో చేయాలనే మీ ఆలోచన ప్రశంసనీయం. 

తెలంగాణ అభివృద్ధికి అమలుచేస్తున్న ప్రణాళికలు, ప్రజలకు మెరు గైన జీవనప్రమాణాలు అందించే మీ ప్రణాళికలు బాగున్నాయి. సమాజంలో సమానత్వాన్ని పెంపొం దించి, వృద్ధిని న్యాయబద్ధంగా ప్రజలందరికీ చేరు వ చేయడం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభి వృద్ధిపై తెలంగాణ అవలంబిస్తున్న స్పష్టమైన విధా నాలు సూపర్’’ అని డబ్ల్యూఈఎఫ్ తన లేఖలో పేర్కొంది.