ప్రపంచ కిడ్నీ దినోత్సవం

ప్రపంచ కిడ్నీ దినోత్సవం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు:  నాగర్​ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం నిర్వహించారు.  ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రఘు కేక్ కట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నూటికి పది మంది కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్నారని తెలిపారు. మన దేశంలో దీనిపై సరైన అవగాహన లేకపోవడం పట్ల ఎంతోమంది జబ్బు ముదిరేవరకు గుర్తించడం లేదన్నారు. కిడ్నీలను కాపాడుకోవబినికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.