WTC ఫైనల్లో తాజా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ 26 బంతుల్లో 15 పరుగులే చేసి కమ్మిన్స్ బౌలింగ్లో పెవీలియన్ చేరగా..ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 31 బంతుల్లో 14 పరుగులే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. రెండుగా చీలిపోయి పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
రోహిత్ శర్మకు చేతకాదు..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో రోహిత్ శర్మ (15) ఔట్ అయిన వెంటనే కొందరు అభిమానులు అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దిగారు. రోహిత్ శర్మకు ఆడటం చేతకాదని..అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అని విమర్శించారు. రోహిత్ శర్మ కీలక మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఆడింది లేదన్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి ముఖ్య కారణం రోహిత్ శర్మనేనని అంటూ ఆరోపించారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ , 2021 WTC ఫైనల్, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమికి ఓపెనర్‌గా రోహిత్ శర్మ వైఫల్యమే కారణమని గుర్తు చేశారు.
రెచ్చిపోయిన కోహ్లీ ఫ్యాన్స్..
రోహిత్ శర్మను కోహ్లీ ఫ్యాన్స్ విమర్శిస్తుంటే కోహ్లీ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. కోహ్లీ ఔటైన వెంటనే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోహ్లీని ట్రోల్ చేశారు. చోక్లీ అంటూ విమర్శలు గుప్పించారు. రోహిత్ కంటే కోహ్లీనే ఫ్రాడ్ అని వ్యాఖ్యానించారు. కీలక మ్యాచ్‌ల్లో కోహ్లీ విఫలమయ్యాడని..లైఫ్ లభిస్తేనే ఆడుతాడని లేదంటే ఆడలేడంటూ ఆరోపించారు. అఫ్గానిస్థాన్ వంటి చిన్న దేశాలపై మాత్రమే సెంచరీలు చేస్తాడని మండిపడ్డారు. రోహిత్ శర్మను విమర్శించే ముందు కోహ్లీ గణంకాలు పరిశీలించాలని రోహిత్ ఫ్యాన్స్కు సూచించారు. కోహ్లీ ఐపీఎల్‌లో తప్పా ఎక్కడా ఆడలేడని ఘాటు విమర్శలు చేశారు.
ఇది కరెక్ట్ కాదు..
కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్ శర్మపై..రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోహ్లీపై విమర్శలు చేయడాన్ని తటస్థ అభిమానులు తప్పుబడుతున్నారు. మన ఆటగాళ్లను మనమే తిట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నారు.