దుబాయ్ : న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఇండియా టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతోంది. పాయింట్స్ పర్సెంటేజ్ (పీటీసీ) మాత్రం తగ్గింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో నాలుగో మ్యాచ్‌లో ఓడిన ఇండియా 68.06 పీటీసీ నుంచి 62.82కి పడిపోయింది.
రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50) కంటే కేవలం 0.32 శాతంతో ముందంజలో ఉంది. శ్రీలంక (55.66), న్యూజిలాండ్ (50) 3,4వ స్థానాల్లో నిలిచాయి. ఇండియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే కివీస్‌తో మూడో టెస్టు, ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్‌లో ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సి ఉంటుంది.