మొబల్ ఫోన్ల తయారీలో దిగ్గజ సంస్థ.. Xiaomi ఇప్పుడు ఆటో మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో Xiaomi తన తొలి ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించింది. SU 7 గా పిలువబడే ఈ కారు తయారీ, ఫీచర్స్ వివరాలను గత సంవత్సరమే విడుదల చేసింది Xiaomi .అయితే ఇది దాని తొలి ఫిజికల్ అప్పియరెన్స్ ప్రదర్శన.
SU7 సొగసైన తీరుతో కనిపించే స్పోర్టీ కారు. బ్లూ పెయింట్ తో ఆకట్టుకుంటుంది. ఇది నాలుగు డోర్స్, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్ ను కలిగి ఉన్న పెర్ఫార్మెన్స్ సెడాన్ గా వర్ణించబడింది. ఈ కారులో సొంత బెస్పోక్ ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నట్లు , ఇది కేవలం 2.78 సెకన్లలో 0 నుంచి 60 mph వేగాన్ని అందుకుంటుందని Xiaomi తెలిపింది.
SU7 ఎలక్ట్రిక్ కారు.. 800 కిలోమీటర్లు(497 మైళ్లు) కంటె ఎక్కువ రేంజ్ అందించగల 101kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న మెజారీటీ EV ల కంటే ఇది గణనీయమైన రేంజ్. ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది కూడా. ఇది కేవలం 15 నిమిషాల్లో వేగవంతమైన ఛార్జర్ తో 317 కిలోమీటర్ల పరిధికి వెళ్లగలిగే ఛార్జింగ్ ను పొందుతుంది. అయితే దీనిని 150kWh బ్యాటరీలతో 700 మైళ్ల కంటే ఎక్కువ పరిధిని అందించేందుకు కంపెనీ యోచిస్తోందని Xiaomi వర్గాలు చెపుతున్నాయి.
ఈకారు వెలుపలి భాగంలో వివిధ రకాల రాడార్, లైడార్ సెన్సార్ లు ఉన్నాయి. ఇవి సెల్ఫ్ డ్రైవింగ్ కు అనుమతిస్తాయి. అయితే క్యాబిన్ లో 16 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే, డ్రైవర్ కోసం హెడ్స్ అప్ డిస్ ప్లే, 7.1 అంగుళాల రోటేటింగ్ డ్యాష్ బోర్డు ఉన్నాయి. ఈ కారు లుకప్ చాలా బాగుంది. ఎలక్ట్రిక్ పోర్చ్సే టైకాన్ ను పోలి ఉండి సొగసైన స్పోర్టీ స్టైల్ కారు అద్భుతంగా ఉంది. ఈ కారులో ఛార్జింగ్ వేగం, ప్రత్యేకించి దాని రేంజ్ తో ఆకట్టుకుంటోంది.
ఇక ధర విషయానికి వస్తే Xiaomi ఈ కారు ధర, కొనుగోలు చేయడం ఎలా , ఎక్కడ అందుబాటులో ఉంది అనే విషయాలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మొదటి 5 ఆటోమోటివ్ కంపెనీలలో ఒకటిగా ఎదగాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. దీని ధర కోసం వేచిచూడాల్సిందే అంటున్నారు కంపెనీ ప్రతినిధులు.. అయితే ఈ కారు అంత చీప్ మాత్రం కాదని.. చాలా కాస్ట్ లీ కారు అని చెప్పకనే చెపుతున్నారు.