యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 20 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి ఉన్న హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు తరలించి కౌంట్ చేశారు. ఇందులో రూ.1,86,38,644 నగదు రాగా.. 241 గ్రాముల బంగారం, 4 కిలోల 650 గ్రాముల వెండి వచ్చిందని ఈవో గీతారెడ్డి చెప్పారు.
అలాగే 595 యూఎస్డాలర్లు, 55 ఇంగ్లాండ్ పౌండ్లు 665 యూఏఈ దిర్హామ్స్, 305 ఆస్ట్రేలియన్డాలర్లు, 20 కెనడియన్డాలర్లు, 22 ఖతార్ రియాల్స్, 145 నేపాల్ రూపీస్, 20 న్యూజిలాండ్ డాలర్లు, 30 సింగపూర్ డాలర్లతో పాటు ఇతర దేశాల కరెన్సీ వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా గురువారం ఆలయానికి రూ.12,24,528 ఆదాయం వచ్చిందన్నారు.