Article 370 Teaser: ఆసక్తిగా ఆర్టికల్ 370.. టీజ‌ర్లో ఏముందంటే?

Article 370 Teaser: ఆసక్తిగా ఆర్టికల్ 370.. టీజ‌ర్లో ఏముందంటే?

కాశ్మీర్ హింస‌, తీవ్ర‌వాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370 ఇందుకు భిన్నం. ఎట్టకేలకు సినిమా టీజ‌ర్ విడుదలైంది. ఇందులో ఓ పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యాక్షన్‌ అవతారంలో యామి గౌతమ్ (Yami Gautam) ఆకట్టుకుంటోంది.  

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఆర్టికల్ 370 పల్స్-పౌండింగ్ టీజర్‌ ఆసక్తి కలిగిస్తుంది. జిహాదీ పేరుతో క‌శ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారంపై ఈ సినిమా తెరకెక్కునున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా టీజర్లో రాజ‌కీయ కుట్ర‌లు, కుతంత్రాలు, తీవ్ర‌వాదం ఇవ‌న్నీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. రెండుసార్లు జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక..ఎటువంటి ప్రశంసలు..విమర్శలు అందుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 370 కి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఆదిత్య ధర్, మోనాల్ థాకర్ అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. 

యామి గౌతమ్ యుద్ధం సినిమాలో త‌రుణ్‌- శ్రీ‌హ‌రి లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించింది. తెలుగులో ఈ భామ కెరీర్ ఆశించిన స్థాయిలో వెల‌గ‌లేదు. కానీ బాలీవుడ్‌లో విక్కీ డోన‌ర్, కాబిల్ లాంటి సినిమాల‌తో న‌టిగా నిరూపించుకుని కెరీర్  పరంగా దూసుకుపోతోంది.