IND vs AUS: రాజ్‌కోట్‌లో దంచి కొడుతున్న ఎండ..స్మిత్ కోసం గ్రౌండ్‌లోనే కుర్చీ

IND vs AUS: రాజ్‌కోట్‌లో దంచి కొడుతున్న ఎండ..స్మిత్ కోసం గ్రౌండ్‌లోనే కుర్చీ

భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు బాగా ఇబ్బందిపడ్డారు. అదేంటి ఆస్ట్రేలియా భారీ స్కోర్ కొడుతుందిగా..! మరి ఇబ్బంది ఏంటి అనుకుంటున్నారా..! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత బౌలర్లను హడలెత్తించినా వారికి సూర్యుడి రూపంలో అనుకోని విలన్ ఎదురయ్యాడు. మొదట్లో బాగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు క్రమంగా ఎండ ధాటికి తట్టుకోలేకపోయారు.

ఇన్నింగ్స్ 28 ఓవర్లో మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత ఎండ తాకిడి తట్టుకోలేకపోయిన స్మిత్ సహాయక సిబ్బందిని పిలిచాడు. మంచినీళ్లను అదేవిధంగా కుర్చీ తీసుకురావాల్సిందిగా కోరాడు. దీంతో  స్మిత్ బాధను గ్రహించిన వీరు కుర్చీతో పాటు ఐస్ ప్యాక్ ని తీసుకొని వచ్చి కాసేపు స్మిత్ కి ఎండ నుంచి ఉపశమనం కల్పించారు. స్మిత్ తో పాటు మార్ష్ కూడా ఎండ తాకిడికి తట్టుకోలేకపోయాడు. వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ మధ్యలో పరిగెత్తడానికి కూడా బాగా ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం రాజ్ కోట్ లో ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. 

Also Read :- హైదరాబాద్‌కు వరల్డ్ కప్ జట్లు రాక.. ఎక్కడ బసచేయనున్నారంటే..?

ఇక ఈ మ్యాచులో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మిచెల్ మార్ష్ (96), వార్నర్(56), స్మిత్(74) హాఫ్ సెంచరీలతో మెరుపులు భారత బౌలర్లను బెంబేలెత్తించారు. ప్రస్తుతం ఆసీస్ 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. లబుషేన్(42), కమ్మిన్స్(4) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రాకి రెండు వికెట్లు దక్కగా.. సిరాజ్, ప్రసిద్ కృష్ణకి చెరో వికెట్ దక్కింది.