
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న అనూష కిందపడింది. జారిపడిన ఆమెపై బస్సు వెనుక టైరు వెళ్లడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.