![ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి.. తండ్రి సమాధి వద్ద సూసైడ్ అటెంప్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/young-man-dies-after-attempting--over-unrequited-love-for-transgender_mLQ42OP9RX.jpg)
- చికిత్స పొందుతూ యువకుడి మృతి
గద్వాల, వెలుగు: ట్రాన్స్ జెండర్ ను ప్రేమించిన ఓ యువకుడు రెండు రోజుల కింద తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. గద్వాల పట్టణంలోని చింతలపేట కాలనీవాసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్(25) అదే కాలనీలో ఉండే ట్రాన్స్ జెండర్ ను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల కింద కాలనీ సమీపంలోని స్మశాన వాటికలో తండ్రి సమాధి దగ్గర పురుగు మందు తాగాడు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కర్నూల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు. ఇదిలాఉంటే నవీన్ ప్రైవేట్ పార్ట్స్ వద్ద తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ జెండర్స్ దాడి చేసి ఉంటారని అంటున్నారు. ఇదిలాఉంటే ఏడాది కింద తండ్రి ఆంజనేయులు యాక్సిడెంట్లో చనిపోగా, కొడుకు నవీన్ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నవీన్ సూసైడ్‌పై కంప్లైంట్ రాలేదని టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ తెలిపారు.