వేధిస్తున్నాడని అమ్మాయి తండ్రి కేసు పెట్టాడని యువకుడు ఆత్మహత్య

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జన్మభూమి రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సీతారాంపురానికి  చెందిన తన్నీరు సాయి కిరణ్ గా గుర్తించారు.  ప్రేమ పేరుతో తమ కూతురిని వేధిస్తున్నాడంటూ సాయి కిరణ్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి. దీంతో  సాయి కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.  కొంతకాలంగా తనను కొందరు వేధిస్తున్నారంటూ మృతుడు సాయి కిరణ్  ఫోన్లో స్టేటస్ పెట్టాడు. మృతుడిపై  గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లుగా సమాచారం.