
యువతి హత్య వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం కడ్లాపూర్కి చెందిన శిరీష(19) అనే యువతి ఇంటర్ చదువుతోంది. జూన్ 10 రాత్రి నుంచి యువతి కనిపించకుండా పోయింది. గ్రామంలోని ఓ కుంట పక్కన ఆమెకు సంబంధించిన దుస్తులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని నీటిలోంచి బయటికి తీసి దర్యాప్తు ప్రారంభించారు. హతురాలి తలపై కళ్లను స్క్రూడ్రైవర్లతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ కరుణసాగర్రెడ్డి తెలిపారు.