
యూట్యూబ్ వీడియోకు మ్యూజిక్ యాడ్ చేయాలంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుందని క్రియేటర్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్లు వాళ్ల వీడియోలకు సంబంధించి లేబుల్స్, కమర్షియల్ స్టూడియోల నుంచి మ్యూజిక్ ప్లే చేసే వీలు లేదు. ప్లాట్‌ఫామ్స్‌లో ఏదైనా వాళ్లకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే యూట్యూబ్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అదే ఏఐ బేస్డ్ మ్యూజిక్ జనరేటర్ టూల్.
ఈ కొత్త ఏఐ టూల్ ద్వారా మ్యూజిక్ అసిస్టెంట్, క్రియేటర్లు తమ వీడియోలకు సరైన ట్రాక్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది జెమిని స్పార్కిల్స్ ఐకాన్‌తో క్రియేటర్ మ్యూజిక్‌లో స్పెషల్ ట్యాబ్గా అందుబాటులో ఉంది. యూజర్లు వీడియో, మూడ్, డ్యురేషన్ వంటి అంశాలను సెర్చ్ చేయడం ద్వారా వాళ్లకు కావాల్సిన మ్యూజిక్ ట్రాక్‌ను వివరించొచ్చు. ప్రాంప్ట్ రాసిన తర్వాత యూజర్లు నాలుగు ఆడియో మోడల్స్ కోసం క్రియేట్ బటన్‌ను ట్యాప్ చేయొచ్చు. కంటెంట్ క్రియేటర్లు ఓపెన్ సోర్స్ ఇనుస్ట్రుమెంటల్స్తో లేదా క్రియేటర్ మ్యూజిక్ ట్యాబ్ ద్వారా యూట్యూబ్ లైబ్రరీని సెలక్ట్ చేసుకోవాలి. ఈ ట్యాబ్‌లో జనరిక్స్, మూడ్, ఓకల్స్, బీట్స్ పర్ మినిట్, డ్యురేషన్ వంటి ఆప్షన్లు ఉంటాయి. వాటిని ఉపయోగించి మ్యూజిక్ బ్రౌజ్ చేయొచ్చు.
కాకపోతే క్రియేటర్ మ్యూజిక్‌లోని అన్ని ట్రాక్‌లు ఫ్రీ కాదు. కొన్ని మాత్రమే ఉచితంగా వాడుకోవచ్చు. మిగతా వాటికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సజెస్ట్ ట్యాబ్‌ను ఉపయోగించి ఏఐని ఐడియాలు అడగొచ్చు. ప్రస్తుతానికి ఈ ఏఐ మోడల్ ద్వారా ఆడియో కాపీరైట్ స్ట్రైక్ పడవు అని మాత్రమే తెలిపింది. ఇంకొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే డివైజ్ అప్‌గ్రేడ్ కోసం కంపెనీ ప్రాంప్ట్‌లను కూడా కలెక్ట్ చేస్తోంది. డేటా సర్వర్లలో 30 రోజులపాటు స్టోర్ చేస్తుంది.