
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ అధికారికంగా విడిపోయినట్టు సమాచారం. నివేదికల ప్రకారం వీరిద్దరికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తుది విచారణ గురువారం (ఫిబ్రవరి 20) ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేయగా.. ఇది 45 నిమిషాల పాటు కొనసాగింది. తర్వాత రెండు పార్టీలు స్నేహపూర్వకంగా విడిపోవాలనే నిర్ణయాన్ని ధృవీకరించాయి. అయితే ధనశ్రీ న్యాయవాది అదితి మోహన్ విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.
విడాకులపై హింట్ ఇస్తూ చాహల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో.. “నేను లెక్కించలేనంత ఎక్కువ సార్లు దేవుడు నన్ను రక్షించాడు. నేను రక్షించబడిన సమయాలను నేను ఊహించగలను. ఎల్లప్పుడూ నా దగ్గర ఉన్నందుకు దేవా, ధన్యవాదాలు. ఆమెన్.” అని రాసుకొచ్చాడు. ధనశ్రీ వర్మ పెట్టిన పోస్టులో ఇలా ఉంది "మనం పడే బాధలు, పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. దేవుడిపై మీకున్న విశ్వాసమే మంచి జరిగేలా చేస్తుంది". అని ధనశ్రీ రాసుకొచ్చారు.
ALSO READ | Champions Trophy 2025: బుమ్రా లేడు.. భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది: పాకిస్థాన్ పేసర్
ప్రస్తుతం చాహల్ భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో చాహల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల రూపాయాల భారీ ధరకు దక్కించుకుంది. చాహల్ కు భారత జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 స్క్వాడ్ లో స్థానం దక్కినా అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత సెలక్టర్లు చాహల్ పూర్తిగా పక్కన పెట్టేశారు. భవిష్యత్ లోనూ చాహల్ భారత జట్టులోకి రావడం కష్టంగానే కనిపిస్తుంది. అతని వయసు 34 ఏళ్ళు కావడం దీనికి ప్రధాన కారణం. 34 ఏళ్ల చాహల్ ఇప్పటివరకు భారత్ తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 217 వికెట్లు పడగొట్టాడు.