సత్యదేవ్, డాలీ ధనంజయ లీడ్ రోల్స్‌లో ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించిన చిత్రం ‘జీబ్రా’. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్. ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. నవంబర్ 22న సినిమా విడుదల కానున్న క్రమంలో బుధవారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఫైనాన్షియల్ క్రైమ్ చుట్టూ నడిచే యూనిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో బ్యాంకర్ పాత్రలో కొత్త సత్యదేవ్‌ని చూస్తారు. గ్యాంగ్ స్టర్ వరల్డ్‌లో ఓ కామన్ మ్యాన్ పడ్డ ఇబ్బందులను ఫన్ ఫుల్‌గా డీల్ చేశాం. థ్రిల్, ఫన్ అద్భుతంగా బ్లెండ్ అవడంతో సిచువేషనల్ కామెడీ పండింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేరోజున విడుదలవుతోంది’ అని చెప్పాడు.
దర్శకుడు మాట్లాడుతూ ‘కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా డిజిటల్ క్రైమ్ ప్రధానాంశంగా తెరకెక్కించాం. బ్యాంకింగ్, గ్యాంగ్ స్టర్, మనీ లాండరింగ్ అనే మూడు ప్రపంచాలను చూపించాం. సత్య, ధన పెర్ఫార్మెన్స్, రవి బస్రూర్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పాడు. ‘కథని నమ్మి, కొత్త కంటెంట్‌తో తీశాం. సత్యదేవ్, డాలీ పోటీపడి నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రతి సీన్ కొత్తగా ఉంటుంది. యూత్‌తో పాటు అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, బాల సుందరం చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.