నువ్వు మగాడ్రా బుజ్జీ:వైట్హౌస్లోనే యుద్ధం చేశావ్:జెలెన్ స్కీకి ఉక్రెయిన్లో జనం జేజేలు

నువ్వు మగాడ్రా బుజ్జీ:వైట్హౌస్లోనే యుద్ధం చేశావ్:జెలెన్ స్కీకి ఉక్రెయిన్లో జనం జేజేలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య సమావేశం ఊహించని మలుపు తిరిగింది. పొగడ్తలతో ప్రారంభమైన సమావేశం..కొద్దిసేపటికే వాగ్వాదానికి దారి తీసింది. ప్రపంచ మీడియా మొత్తం వైట్ హౌజ్లో ఉండగానే  బహిరంగంగానే గొడవపడ్డారు ట్రంప్, జెలెన్ స్కీ. ట్రంప్తో లంచ్ను వాయిదా వేసుకొని వెళ్లిపోయారు జెలెన్ స్కీ. రష్యాతో యుద్ధ పరిష్కారానికి వచ్చిన జెలెన్ స్కీ.. ట్రంప్ తీరును చూసి మధ్యలోనే వెళ్లిపోయారు. అయితే వైట్ హౌజ్ లో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాదనలు సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశం కోసం జెలెన్ స్కీ ప్రదర్శించిన తెగువను యూరప్ మెచ్చుకుంటోంది. జెలెన్ స్కీ కి చేసింది కరెక్ట్ అంటున్నారు. 

అమెరికాతో కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ వైట్ హౌజ్ ను విడిచిపెట్టాడు. ఉక్రెయిన్ మద్దతు ఇవ్వాలంటే ఖనిజ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించడంతో జెలెన్ స్కీ తిరస్కరించాడు. ట్రంప్ తో వాగ్వాదం అమెరికా పర్యటనను అకస్మాత్తుగా ముగించుకొని వెళ్లిన జెలెన్ స్కీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ణతలు. ఉక్రెయిన్ కు శాశ్వత శాంతి అవసరం అని  పోస్ట్ లో తెలిపారు.  

ట్రంప్ తో లంచ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ ట్రంప్ నుం ఖనిజ ఒప్పందం మాట విన్న వెంటనే వైట్ హౌజ్ నుంచి వెళ్లిపోయారు జెలెన్ స్కీ. అయితే జెలెన్ స్కీకి  యూరప్ నుండి మద్దతు లభించింది. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంతో ఏమీ తీసుకురాలేకపోయినా జెలెన్ స్కీకి స్వదేశంలో మద్దతును సంపాదించగలిగాడు. రాజకీయ నేతలు, ప్రజలు, సైనికులు ఇలా ఒకరేమిటి ఉక్రెయిన్ మొత్తం  సోషల్ మీడియాలో అతని సాహసాన్ని హర్షించారు. 

జెలెన్ స్కీకి ఉక్రెయిన్ ప్రయోజనాల పట్ల నిబద్ధత, దేశం పట్ల భక్తిని ఈ రోజు మనం యునైటెడ్ స్టేట్స్ లో చూశాం.అంటూ ఉక్రెయిన్  ఉప ప్రధాని ఒలెక్సీ కులేబా టెలిగ్రామ్ లో రాశారు. దేశం కోసం మా నాయకుడి ఓర్పు, పోరాటం గొప్పదని ప్రశంసించారు.