మహిళ మెడలోంచి పుస్తెల తాడు చోరీ

మహిళ మెడలోంచి పుస్తెల తాడు చోరీ
  • నిందితుడు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన నిందితుడిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్​చేశారు. బాలానగర్​ ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​జిల్లా అడ్డకల్​మండలానికి చెందిన ఎం.ప్రవీణ్​సాగర్ ఉపాధి కోసం సిటీకి వచ్చి నిజాంపేట రాజీవ్​గృహకల్పలో ఉంటూ జోమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో దొంగతనాలు చేసి ఈజీగా సంపాదించాలని ప్లాన్ చేశాడు. నిజాంపేట రాజీవ్​గృహకల్పలో నివాసం ఉండే బాలమ్మ (55) అక్కడ ఇస్త్రీ పనిచేసుకుంటూ జీవిస్తున్నది. 

ఈ నెల 8న ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికి వెళ్లినట్టు వెళ్లి, ఆమె మెడలోని రెండున్న ర తులాల బంగారు గొలుసు తెంచుకుని పారిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పుస్తెల తాడు రికవరీ చేశారు.