న్యూఢిల్లీ: జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్ కొత్త స్టార్టప్ కంటిన్యూ ని లాంచ్ చేశారు. ఈ కంపెనీ హెల్త్ ట్రాకింగ్, మెంటల్ వెల్‌నెస్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్‌స్లోప్ అడ్వైజర్స్ పేరు మీద ఈ కొత్త స్టార్టప్‌ను గోయెల్ ప్రారంభించారు. ఇందులో బ్లింకిట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ గోయెల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఇది నా పర్సనల్ టీమ్‌లా పనిచేస్తోంది.
ఫండింగ్ మొత్తం నేనే చూసుకున్నాను. నా పనితీరు బాగుండేలా కంటిన్యూ చూస్తుంది. నాకైతే కంటిన్యూ టీమ్‌తో ఉంటే జిమ్‌లో ఉన్నట్టే’ అని దీపిందర్ గోయెల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ స్టార్టప్ కంపెనీ ఇంకా ఎర్లీ స్టేజ్‌లో ఉంది. గోయెల్ ఇప్పటివరకు రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు.