కేసీఆర్ పై అభిమానంతో వరంగల్ కు పాదయాత్ర

కేసీఆర్ పై అభిమానంతో వరంగల్ కు పాదయాత్ర

మెదక్, వెలుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్​పై ఉన్న అభిమానంతో  ఓ పార్టీ కార్యకర్త ఈ నెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు పాదయాత్రగా బయలుదేరాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గడ్డమీది రవి గురువారం ఉదయం 5 గంటలకు పాదయాత్రగా బయలుదేరి మధ్యాహ్నం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్నాడు. మెదక్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు రవికి శాలువా కప్పి  సన్మానించారు. 

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేసీఆర్​పై ఉన్న అభిమానంతో పాదయాత్రగా వెళ్లి వరంగల్ రజతోత్సవ సభకు చేరనున్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, మహమ్మద్ పాల్గొన్నారు.