ఘనపూర్ డ్యాంకు సింగూర్ నీళ్లు విడుదల

ఘనపూర్ డ్యాంకు  సింగూర్ నీళ్లు విడుదల

పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ నుంచి మెదక్ జిల్లాలోని ఘనపూర్ డ్యాం ఆయకట్టు రైతులకు శనివారం రెండో విడతగా 0.35 టీఎంసీల నీటిని విడుదల చేశారు. మొదటి విడతగా జనవరి 23న 0.35 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈ నీటిని గేట్ల ద్వారా కాకుండా విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా దిగువన ఉన్న మంజీరా బ్యారేజీలోకి విడుదల చేశారు. 

అక్కడి నుంచి మంజీరా నది వెంట మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్ట్ లోకి చేరుకుంటాయి. పశువులు, గొర్ల  కాపరులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లరాదని ఇరిగేషన్ శాఖ డీఈఈ నాగరాజు, ఏఈఈ మహిపాల్ రెడ్డి సూచించారు.