- 16 నుంచి గ్రేటర్లో కరోనా వ్యాక్సినేషన్
- హెల్త్ స్టాఫ్ డేటా కలెక్ట్ చేశామంటున్న డీఎంహెచ్వోలు
- ఈజేహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ల స్టాఫ్ ను పట్టించుకోలే..
హైదరాబాద్,వెలుగు: కరోనా వ్యాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు రెడీ అయ్యాయి. గ్రేటర్లో 411 సెంటర్లలో లక్షా 25 వేల మంది హెల్త్స్టాఫ్ కి వ్యాక్సిన్ వేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ తో పాటు మెడికల్ కాలేజ్‌లకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒక్కో సెంటర్లో నలుగురు చొప్పున మొత్తం 1650 మంది స్టాఫ్ వ్యాక్సినేషన్లో పాల్గొననున్నారు. రోజుకు 50 నుంచి 100మందికి వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఈనెల 16న గాంధీ, చెస్ట్, నాంపల్లి ఏరియా, ఫీవర్ హాస్పిటళ్లతో పాటు సికింద్రాబాద్యశోద, సికింద్రాబాద్ కిమ్స్, బంజారాహిల్స్ రెయిన్ బో, జూబ్లీహిల్స్అపోలో, బొగ్గుల కుంటలోని ఫెర్నాండెజ్ హాస్పిటల్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించి హెల్త్ స్టాఫ్ తో మాట్లాడనున్నట్లు తెలిసింది.
వీరి వివరాలు తీసుకోలే..
అందరి డాటాను కలెక్ట్ చేశామని జిల్లా మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నప్పటికీ ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే ఎంప్లాయీస్,పెన్షనర్లు,జర్నలిస్టుల(ఈజేహెచ్ఎస్)లతో పాటు వెల్నెస్ సెంటర్లలోని హెల్త్ స్టాఫ్వివరాలను తీసుకోలేదు. రాష్ట్రంలో మొత్తం12వెల్నెస్ సెంటర్లు ఉండగా వీటిలో డాక్టర్స్, స్టాఫ్ తో పాటు ఇతరులు 500 మంది వరకు ఉన్నారు. కొన్ని వెల్ నెస్ సెంటర్లలోనైతే డేటాను కలెక్ట్ చేశారు. కానీ హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురం, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లిలోని వెల్నెస్ సెంటర్ల స్టాఫ్ వివరాలు తీసుకోలేదు. వీరికి వ్యాక్సినేషన్ కి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు.
3 వెల్నెస్ సెంటర్లలోని స్టాఫ్‌కి..
ఖైరతాబాద్, వనస్థలిపురం, కూకట్పల్లి వెల్నెస్ సెంటర్లకు ప్రతిరోజూ వెయ్యి వరకు ఓపీ పేషెంట్లకు ట్రీట్మెంట్అందిస్తున్నారు. ఆయా సెంటర్లలో130 మంది స్టాఫ్ పని చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ఫ్రంట్లైన్లో ఉంటూ ట్రీట్ మెంట్అందించారు. ఇదే సమయంలో కొందరు డాక్టర్లతో పాటు స్టాఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. తమను గుర్తించకపోవడంతో సిబ్బంది ఆందోళన లో పడ్డారు. పాజిటివ్వచ్చి క్వారంటైన్లో ఉన్న వారికి పేవ్మెంట్ ఇవ్వలేదని, వ్యాక్సిన్ఇచ్చేందుకు వీరి నుంచి ఎలాంటి వివరాలు కూడా తీసుకోలేదు.
గ్రేటర్ పరిధిలోని జిల్లాలు
జిల్లా హెల్త్ స్టాఫ్
హైదరాబాద్ 78 వేలు
రంగారెడ్డి 26 వేలు
మేడ్చల్ 21 వేలు
ఫస్ట్ ఫేజ్‌లో ఫ్రంట్‌లైన్ వారియర్స్
హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇస్తం. మిస్‌అయితే వారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఎవరైనా వివరాలు ఇయ్యకుంటే వెంటనే అందించాలి. ఈజేహెచ్ఎస్ కి సంబంధించిన వారి డేటాను కూడా సేకరిస్తున్నాం. పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో ఫ్రంట్లైన్వారియర్స్కి వ్యాక్సిన్ అందిస్తాం.
– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో హైదరాబాద్జిల్లా