
ఏఫ్రిల్ ఫస్ట్ అంటే ఫూల్స్ డే అనే అభిప్రాయం ఉంది.. ఆ రోజు ఏం చెప్పినా అది నిజం అనుకునే కంటే.. అబద్దం అని.. ఫూల్స్ చేయటానికి అని భావించేవారే 90 శాతం మంది అంట.. అలాంటి ఏప్రిల్ ఫస్ట్ తేదీన పుట్టిన కంపెనీలు.. ప్రకటించిన విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నాయి.. అవును.. మీరు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. అప్పట్లో ఏప్రిల్ ఒకటో తేదీన ప్రకటించి.. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప కంపెనీలు, టెక్నాలజీకి తిరుగులేని విధంగా ఎదిగినవి ఏంటో చూద్దాం..
>>> G mail.. జీ మెయిల్ పుట్టింది ఏప్రిల్ ఫస్ట్ తేదీనే.. 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు. చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు కూడా.. ఇప్పుడు అదే జీ మెయిల్ లేకుండా ఊహించగలమా చెప్పండి.
>>> మన ఆర్బీఐ.. RBI.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రారంభమైన రోజు కూడా ఏప్రిల్ ఫస్ట్. 1976లో.. ఏప్రిల్ ఒకటో తేదీన రేడియోలో ఈ ప్రకటన విన్నప్పుడు చాలా మంది నిజం కాదనుకున్నారట.
>>> యాపిల్ కంపెనీ స్థాపించింది 1976, ఏప్రిల్ 1. ఫస్ట్ యూనిట్ ప్రొడక్టులను రిలీజ్ చేసేందుకు రెండు నెలల సమయం పట్టింది. అప్పటిదాకా జనాలెవ్వరూ ఆ వార్తను నమ్మలేదు. ఎందుకంటే యాపిల్ కంపెనీ వాళ్లు ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని జనం అంతా అనుకున్నారంట.
>>> ఇన్కం ట్యాక్స్ ఇండియాలో పుట్టింది కూడా ఏప్రిల్ 1వ తేదీనే. 1869, ఏప్రిల్ 1 నుంచి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియాలో ఇన్కం ట్యాక్స్ను అమలు చేసింది. సంవత్సరానికి 200 నుంచి 500 ఆదాయాన్ని ఆర్జించిన ప్రజల నుంచి బ్రిటీష్ ప్రభుత్వం ఆదాయపు పన్నును వసూలు చేసేది. సంవత్సరానికి 200 సంపాదించే వాళ్ల నుంచి 2 శాతం, 500 సంపాదించే వాళ్ల నుంచి 4 శాతం ఇన్ కం ట్యాక్స్ వసూలు చేసేవాళ్లు. ఇన్కం ట్యాక్స్ నుంచి నేవీ, ఆర్మీ, పోలీసులకు మినహాయింపు ఇచ్చారు.
సో.. కొన్ని కొన్ని సార్లు ఫూల్స్ డే రోజున ప్రకటించినా కూడా.. అవి ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్లాయి.. ఇక్కడో ఇంకో టెక్నిక్ కూడా ఉంది అంటున్నారు మార్కెటింగ్ నిపుణులు.. ఏప్రిల్ ఫస్ట్ ను ప్రకటిస్తే అది ఫూల్స్ అనుకుంటారని.. ఆ ప్రాడక్ట్ పై అంచనాలు తక్కువగా ఉంటాయని.. ఆ తర్వాత మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాడక్ట్ పై నెగెటివ్ కంటే పాజిటివ్ పెరుగుతుందనే భావన కూడా ఉందంట..
సో.. ఏది ఏమైనా.. టెక్నికల్ గా.. ఏప్రిల్ ఫూల్స్ డే అనేది బహువచన పదం. చాలా మందిని పూల్స్ ను చేయడం ఈ రోజు ఉద్దేశం. కానీ.. స్పెల్లింగ్ ను పలకడంలో వచ్చిన తేడాల కారణంగా ‘ఫూల్'స్ డే'గా స్థిరపడిపోయింది. ఆట పట్టించడం హద్దులో ఉంటే ఆరోగ్యకరమైన హాస్యానికి దారితీస్తుంది. హద్దులు దాటితే అవతలివారి మనోభావాలని దెబ్బతీస్తుంది. అందుకే హద్దులు పాటిస్తూ పూల్స్ డేని సెలబ్రేట్ చేస్కోండి.