
ఒడిశాలోని కటక్ రైలు ప్రమాదం జరిగింది.నెర్గుండి స్టేషన్ సమీపంలో ఆదివారం(మార్చి30) బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 25మంది గాయపడ్డారు.గాయపడిన వారికిమూడు వైద్యుల బృందాలు చికిత్స అందిస్తున్నాయి. మృతుడి వివరాలు ఇంకా తెలిసి రాలేదు.
ఈ రైలు పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియలేదని తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంతో ఈ మార్గంలో నిలిచిపోయిన రైళ్లను దారి మళ్లించడం, పట్టాలు తప్పిన ప్రదేశంలో బాధిత ప్రయాణికులకు రైల్వే, స్థానిక అధికారులు అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నారు.
Also Read : భూకంప సాయానికి ఆపరేషన్ ‘బ్రహ్మ’
ఘటనాస్థలంలో NDRF,ఒడిశా విపత్తు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) బృందాలు ,రైల్వే వైద్య బృందం, అత్యవసర వైద్య పరికరాలతో కూడిన ప్రమాద సహాయ రైలు లో ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.
So many train a¢¢idents, yet the Railway Minister refuses to take responsibility. Never in India's history has there been such a shameless and careless minister ignoring passenger safety!
— Khan Sahab😎 (@roflkhan00) March 30, 2025
Resignation is the least he can do.#trainaccident pic.twitter.com/31DA7sxuFW
బెంగళూరు కామాఖ్య ఎక్స్ ప్రెస్ రైలులోని 11 ఎసి కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదం కారణంగా మూడు రైళ్లను దారి మళ్లించారు. ఈ ప్రమాదం డౌన్ లైన్ లో జరిగినందున సాధారణ రైలు సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు పనులు ప్రారంభించామని ECoR చీఫ్ PRO తెలిపారు.