వాంకిడి మండలంలో 1.30 లక్షలు పట్టివేత

ఆసిఫాబాద్, వెలుగు : వాంకిడి మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేపడుతుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1లక్ష 30 వేల నగదును పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రాంబారే చంద్రషుడ్ హైదరాబాద్ కు వెళ్తుండగా అతడి కారులో తనిఖీ చేయగా రూ.1లక్ష 30 వేలు దొరికినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.