గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ వేగంగా సాగుతోంది. సోమవారం (జనవరి 8) సాయంత్రం వరకు లక్షా 93 వేల ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్ లైన్ ఎంట్రీ చేసినట్లు జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు. జనవరి 17 వరకు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్ లైన్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలనుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 లక్షల 74 వేల 325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్ లో అప్లికేషన్స్ ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. 3 వేల 500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్ లైన్ నమోదు ప్రక్రియ సాగుతోంది. జనవరి 17 వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్ లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు.