పిల్లలమర్రి అభయాంజనేయస్వామికి ఘనంగా లక్ష పుష్పార్చన

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి అభయాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా హనుమాన్ జయంతి త్రయానిక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు దరూరి వెంకట రాఘవాచార్యులు ఆంజనేయస్వామికి లక్ష మల్లె పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. మల్లెల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు రామానామస్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గవ్వ కృష్ణారెడ్డి, దరూరి సింగారాచార్యులు, చింతాడ రామానుజాచార్యులు, ముడుంభై రఘువరన్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.