దేశంలో ఏటా 1.3 మిలియన్ల క్యాన్సర్​ పేషెంట్లు

దేశంలో ఏటా 1.3 మిలియన్ల క్యాన్సర్​ పేషెంట్లు

మాదాపూర్​, వెలుగు : బ్లడ్ క్యాన్సర్​పై పోరాడేందుకు మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన అవసరమని యశోద గ్రూప్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్.జి.ఎస్.రావు అన్నారు. మాదాపూర్ యశోద హాస్పిటల్​లో శనివారం డెక్కన్​ హెమటోలింక్ 2.O పేరిట అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, పేషెంట్ కేర్ ‌‌‌‌‌‌‌‌లో వచ్చిన తాజా పురోగతులపై చర్చించారు. డాక్టర్​జి.ఎస్.రావు మాట్లాడుతూ దేశంలో బ్లడ్ క్యాన్సర్​పేషెంట్ల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు.

గ్లోబోకాన్​ 2020 నివేదికల ప్రకారం.. ఏటా 1.3 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. లుకేమియా, లింఫోమా, మైలోమాతో సహా బ్లడ్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌లు పెరుగుతూనే ఉన్నాయన్నారు. డాక్టర్​గణేష్ జైషేత్వర్ తోపాటు 200 మందికిపైగా జాతీయ, 10 మందికిపైగా అంతర్జాతీయ ఆంకాలజీ, హెమటో-ఆంకాలజీ వైద్య నిపుణులు పాల్గొన్నారు.