ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ ను విజయవంతంగా లాంచ్ చేసి గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే 2028 నాటికి చంద్రయాన్ 4 ను ప్రయోగించాలని ఇస్రో ప్రయత్నిస్తుంది. ఈసారి రెండు రాకెట్లు చంద్రుని మీదికి వెళ్లి మళ్లీ సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావాలి. మూన్ పై ఉన్న శిలాజలాలు, మట్లి శాంపిల్స్ సేకరించే లక్ష్యంగా చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ డిజైన్ చేసినట్లు ఇటీవల ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇచ్చిన ప్రజంటేషన్ ద్వారా తెలుస్తోంది. చంద్రయాన్ 4 విజయవంతమైతే లూనార్(చంద్రుడి) నుంచి నమోనాలు సేకరించిన నాల్గొవ దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది.
ALSO READ :- సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు
ఈ మిషన్ లో రెండు వేర్వేరు రాకెట్లు- హెవీ-లిఫ్టర్ LVM-3, PSLV -శాటిలైట్స్ ను స్పెస్ లోకి తీసుకెళ్లనున్నాయి. ఇదే జరిగితే ఇండియాలో ఒకే ప్రాజెక్ట్ లో రెండు రాకెట్స్ వాడిన మొదటి మిషన్ ఇదే అవుతుంది. ఈ రెండు రాకెట్లు కూడా వేర్వేరు రోజులలో ప్రయోగిస్తారట. గతంలో చంద్రయాన్ ప్రాజెక్టుల్లో 2, -3 మాడ్యూళ్లను వాడారు. కానీ చంద్రయాన్-4 మిషన్ ఐదు అంతరిక్ష నౌక మాడ్యూళ్స్ ఉన్నాయని, అవి ప్రొపల్షన్, డిసెండర్, ఆరోహణ, ట్రాన్స్‌ఫర్, రీ-ఎంట్రీ మాడ్యూల్స్ అని ప్రెజెంటేషన్ లో చెప్పారు.