- తల్లి పక్కన పడుకున్న బాలుడిని ఎత్తుకెళ్లిన ముగ్గురు మహిళలు
నిజామాబాద్, వెలుగు : ఇందూర్ పట్టణంలోని జీజీహెచ్ గ్రౌండ్లో ఏడాది వయసు ఉన్న బాలుడు శనివారం కిడ్నాప్‌నకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజు నిజామాబాద్ బస్టాండ్ క్యాంటీన్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య లక్ష్మి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయిస్తానని భర్త చెప్పాడు. దీంతో ఆరేండ్ల లోపు ఉన్న ముగ్గురు పిల్లలను తీసుకొని శుక్రవారం సాయంత్రం బస్సులో నిజామాబాద్ వచ్చింది.
ఉదయం హాస్పిటల్‌కు వెళ్దామని నిర్ణయించుకొని భోజనం చేసి రాత్రి జీజీహెచ్ పార్కింగ్ ఏరియాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి ఏడాది వయసు ఉన్న మణికంఠ కనిపించలేదు. పరిసరాల్లో వెతికినా కనిపించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా, రాత్రి 2 గంటల ప్రాంతంలో ముగ్గురు మహిళలు బాబును ఎత్తుకెళ్తున్నట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.