![ట్యూషన్‌కు వెళ్తున్న అన్నకు టాటా చెప్తూ.. బిల్డింగ్ పైనుంచి పడి చిన్నారి మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/1-year-old-child-falls-to-die-from-building-in-hyderabad_cnuwJkLh4I.jpg)
జీడిమెట్ల, వెలుగు : ట్యూషన్ వెళ్తున్న అన్నకు టాటా చెప్తున్న ఓ చిన్నారి బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయింది. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుభాష్ నగర్‌కు చెందిన నజీమ్, పర్వీన్ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
వీరికి నలుగురు పిల్లలు. పెద్ద కుమారుడు అద్నాన్ శనివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్తుండగా, ఏడాది వయస్సున్న చిన్న కుమార్తె సిద్దా అనమ్ రెండో అంతస్తు బాల్కనీలో నిలబడి టాటా చెప్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయింది