పటాన్ చెరు – దిల్ సుఖ్​నగర్​ రూట్ లో 10 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు

  • రేపటి  నుంచి అందుబాటులోకి..

హైదరాబాద్,వెలుగు: సిటీ వాసులకు ఆర్టీసీ బస్సు జర్నీ మరింత ఈజీ చేసేందుకు టీజీఎస్​ఆర్టీసీ కొత్త బస్సులను నడపనుంది. పటాన్​చెరు–దిల్​సుఖ్​నగర్​మధ్య కొత్తగా 10 ఎలక్ట్రిక్​ఏసీ మెట్రోలగ్జరీ బస్సులు అందుబాటులోకి వస్తాయని గ్రేటర్​హైదరాబాద్​ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని గురువారం నుంచి 217డీ నంబర్​రూట్​లో నడపనున్నట్టు పేర్కొన్నారు.

ALSO READ :సీతారామకు తొలగిన  చైనా ఇంజినీర్ల సమస్య..!

లింగంపల్లి, గచ్చిబౌలి, మెహదీపట్నం, లక్డీకాపూల్, అబిడ్స్​, కోఠి, మలక్​పేట మీదుగా వెళ్తాయన్నారు. ఐటీ ఎంప్లాయీస్ తో పాటు వివిధ మల్టీనేషనల్​కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్​ఆస్పత్రుల ప్రాంతాల్లోని ప్యాసింజర్లకు జర్నీ ఈజీ అవుతుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు లింగంపల్లి నుంచి,  ఆఖరు బస్సు రాత్రి 10.03 గంటల వరకు, దిల్​సుఖ్​నగర్​ నుంచి ఉదయం 6.40గంటల  నుంచి ప్రారంభమై ఆఖరు బస్సు రాత్రి 11.53 గంటల వరకు ప్రతి 22 నిమిషాల ఫ్రీక్వెన్సీలో నడుస్తాయని తెలిపారు.