మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: దుండిగల్ మండలం గాగిల్లాపూర్‌లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర శరత్ నాయక్ సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. సర్వే నంబర్ 204, 213లోని 70 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ వేశారని, ఇందులో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. దుండిగల్ తహసీల్దార్ కబ్జాకు సహకరించారని, ఆయనపై విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.