నిప్పంటుకొని 10 ఎకరాల వరి దగ్ధం

నిప్పంటుకొని  10 ఎకరాల వరి దగ్ధం

మల్హర్, వెలుగు : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 10 ఎకరాల వరి కాలిపోయింది . ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎడ్లపల్లిలో శుక్రవారం జరిగింది. ఎడ్లపల్లి  చెరువు కట్ట శివారులో రంగు సంపత్‌‌‌‌‌‌‌‌, మంతిని సారయ్య, తోట రమేశ్‌‌‌‌‌‌‌‌  2 ఎకరాల చొప్పున, తోకలు రాములు, కామ వెంకటేశం ఎకరం చొప్పున వరి సాగు చేస్తున్నారు. శుక్రవారం ఈ రైతుల పొలంతో పాటు, పక్కనే ఉన్న కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మరికొందరు రైతుల వరికి నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంటను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

విగ్రహ తయారీ కేంద్రంలో...

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని విగ్రహాల తయారీ కేంద్రం దగ్ధమైంది. మంటలను స్థానికులు, అటుగా వెళ్తున్న సీఐ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ గమనించి ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో పీచు, ఇతర సామగ్రి కాలిపోయిందని, రూ. 3 లక్షల నష్టం జరిగిందని బాధితుడు కృష్ణంరాజు చెప్పారు.