- కిలో 8వేలకు కొని ముంబయిలో కిలో 15వేలు చొప్పున అమ్ముతున్నారు: రాచకొండ సీపీ మహేష్ భగవత్
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ నర్సీపట్నం నుండి ముంబై కిఫ్ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలో 10 మందిని రాచకొండ ఎస్ ఓ టి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు సుబ్బారావు పరారయ్యాడు. నిందితుల వద్ద నుండి సుమారు 90 లక్షల విలువైన 240 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు కార్లు, 8 లక్షల నగదు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒడిశా-ఆంద్రా సరిహద్దులోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి అక్రమంగా ముంబయికి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ ఎస్ఓటీ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు ఉమ్మడిగా తనిఖీలు చేసి ముఠాను పట్టుకున్నారు.
గంజాయి ముఠా సూత్రధారి కేరళవాసి శివన్ కృష్ణ
గంజాయి ముఠా సూత్రధారి కేరళవాసి శివన్ కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఇతడు ఒడిశా రాష్ట్రంలోని అల్లుడుకోటా వద్ద ఉన్న గౌండ్ల గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కేరళ నుంచి ఒడిశాకు సరుకులు తీసుకొచ్చిన లారీల వారిని మళయాళంలో మాట్లాడి ఆకట్టుకునేవాడు. ఎక్కువ కిరాయి ఆశ చూపి ముంబయికి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని ఏవోబీ ఏజెన్సీలో కిలో 8వేలకు గంజాయి కొని మహారాష్ట్ర, ముంబయి ఏరియాలో కిలో 15వేలకు అమ్ముతున్నాడు. ఎరువులు, ఇతర సరుకుల ముసుగులో గంజాయి పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ అక్రమ రవాణా గురించి ఉప్పందడంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీసుల సహకారంతో ముఠా ఆచూకీ కనిపెట్టు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన 10 మంది నిందితులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో నిందితుడు సుబ్బారావు పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు.
పట్టుపడిన నిందితులు వీరే..
1.అంగడి ఉపేందర్. మరిపెడ, మహబూబాబాద్ జిల్లా
2.సంతోష్ లాల్ జీ.. అగర్వాల్, సంతాపూర్, ముంబయి
3.తేజస్ కుమార్, ముంబయి
4.నవీద్, ముంబయి
5.మహమ్మద్ షమీర్ అలీ (కేరళ, లారీ డ్రైవర్)
6.హరీష్ (కేరళ, లారీ డ్రైవర్)
7.సుమేష్ (కేరళ, లారీ క్లీనర్)
8.షేక్ జిలానీ, నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా
9.అడిగెల ప్రకాష్, నీలంపేట గ్రామం, నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా
10.డానియెల్, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ కు బండి సంజయ్ డెడ్ లైన్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష.. జరిమానా
శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. వేసుకున్న గుడిశెలను కూల్చేశారు