భారతీయ విద్యార్థులకు విద్యా, ఉద్యోగాలు అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే..

విదేశీ విద్యపట్ల భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. మెరుగైన విద్య, మంచి కేరీర్ మార్గాలు, స్కాలర్ షిప్ లు వంటి అవకాశాలు ఉండటంతో  భారత దేశం నుంచి విదేశాలకు చదువుల కోసం వలస వెళ్లే వారి సంఖ్య ఇటివల భారీగా పెరిగిందని వివిధ సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి. 

2021 నుంచి 2022 మధ్య కాలంలో 68శాతం మంది ఇతర దేశాలకు పై చదువులకు కోసం వెళ్లిన వారు ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే వారు 44లక్షల వరకు ఉన్నట్లు పలు మీడియా సంస్థల  అంచానాలు. ఇంత పెద్ద ఎత్తున వలసలకు అనేక కారణాలు ఉన్నాయి. సాంకేతికత, నైపుణ్యాల పెంపొందించుకునేందుకు విదేశీ విద్య చక్కని అవకాశం. 

ఆయా దేశాల్లో వినూత్నంగా ఆలోచించడం, పెట్టుబడులు, మార్కెటింగ్, స్టార్టప్ సంస్థల రూపకల్పనలకు, అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా ప్రమాణాలు గొప్పగా ఉంటాయనే ఆలోచనలతో అంతర్జాతీయంగా పని చేసిన వారి అనుభవం భవిష్యత్ లో ఉపయోగపడుతుంది. 

విద్యార్థులు దేశ సరిహద్దులు దాటి వెళ్లినప్పుడు వారు కొత్త టెక్నాలజీ,  అలాగే మంచి స్కిల్స్ సొంతం చేసుకోవడానికి విదేశాల్లో ఇంటర్న్ షిప్ చేయడం మంచిదని ప్రముఖ విద్యావేత్తలు చెప్పుకొస్తున్నారు.

టాప్ 10 దేశాలు ఇవే..

  • ఇంగ్లాండ్
  • అమెరికా
  • ఆస్టేలియా
  • అర్జెటినా
  • న్యూజిలాండ్
  • స్పెయిన్
  • ఇండోనేషియా
  • మెక్సికో
  • మలేషియా
  • ఇటలీ

దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడం, జాబ్ ఎక్సిపీరియన్స్ మంచి ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతున్నారు.