బాలికలకు సైకిళ్లు అందజేత

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం రోటరీ క్లబ్, హైదరాబాద్ నార్త్ క్లబ్​ల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రూపా స్కూల్​లో బాలికలకు 10 సైకిళ్లను అందజేశారు. బాలికల విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం, సామాజిక సేవకు రోటరీ క్లబ్​ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని క్లబ్​ అధ్యక్షురాలు మహాలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ట్రెజరర్​ విద్యాసాగర్, పాస్ట్ ప్రెసిడెంట్ యశోద రాంబాబు, నాగేశ్వరరావు, మునికేశవ్, రఫీ, అజయ్​కుమార్, బ్రహ్మారెడ్డి, అజీం తదితరులు పాల్గొన్నారు.