World Cancer Day 2025: ఈ ఫుడ్స్ రోజూ తింటే క్యాన్సర్ రాదు..

World Cancer Day 2025: ఈ ఫుడ్స్ రోజూ తింటే క్యాన్సర్ రాదు..

క్యాన్సర్.. చిన్న పెద్ద, ఆడ  మగ, వంటి తేడాలు లేకుండా అందరిలో పెరిగిపోతున్న వ్యాధి క్యాన్సర్.. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే క్యాన్సర్ పెరగడానికి ప్రధాన కారణమని చెప్పచ్చు. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్స అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే మరణం తథ్యం అన్న పరిస్థితి ఉండేది కానీ.. ఇప్పుడు ఎలాంటి క్యాన్సర్ అయినా ప్రాథమిక దశలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే.. పూర్తిగా నయం అవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ... చికిత్స సమయంలో క్యాన్సర్ రోగులు కీమో థెరపీ, రేడియేషన్ వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

అలాంటి  క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఈ జాగ్రత్తలో మొదటిది ఆహారపు అలవాట్లు.. మనం రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని, పలు రకాల ఫుడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. 

ఈ ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు:

బెర్రీస్

మనం తరచూ తినే స్ట్రాబెర్రిస్, బ్లూ బెర్రీస్ వంటి వాటిలో క్యాన్సర్ రాకుండా కాపాడే పోషక విలువలు ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు జీర్ణాశయ క్యాన్సర్ నుండి మనల్ని కాపాడతాయి. వీటిలో ఉండే బ్లూ, రెడ్, పర్పుల్ కలర్ పిగ్మెంట్లలో పోషక విలువల మ్యాజిక్ దాగి ఉంటుంది.

క్రూసిఫెరస్ వెజిటబుల్స్

బ్రోకలీ, కాలీఫ్లవర్, బోక్ చోయ్, క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి వాటిని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. ఈ పేరు లాటిన్ "క్రూసిఫెరా" నుండి వచ్చింది, అంటే "క్రాస్-బేరింగ్" అని అర్ధం, ఎందుకంటే ఆకులపై నాలుగు రేకులు శిలువను పోలి ఉంటాయి. కలర్, షేప్ విభిన్నంగా ఉన్నప్పటికీ వీటిలో క్యాన్సర్ తో పోరాడే ఇండోల్-3-కార్బినోల్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల అనేక క్యాన్సర్‌ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఫిష్

ఫిష్‌లో పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, ఆంకోవీస్ వంటి ఆయిలీ ఫిష్ లలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఫిష్ ఇన్ఫ్లమేషన్ నుండి బ్రెస్ట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ నుండి కాపాడుతుంది. ఫిష్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు. 

వాల్ నట్స్

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం, వాల్‌నట్‌లు క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉంటాయని తేలింది. ఫైబర్, హెల్తి ఫ్యాట్ అధికంగా ఉండే ఈ చిరుతిండి గింజలు స్నాక్స్ రూపంలో సెరల్స్, సలాడ్ లతో రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుండి దూరంగా ఉండచ్చు.

చిక్కుళ్ళు

పప్పుధాన్యాలు, బీన్స్‌లో క్యాన్సర్ నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి క్యాన్సర్-పోరాట లక్షణాలున్న అత్యంత చవకైన ఫుడ్స్ లో ఇవి బెస్ట్ అని చెప్పచ్చు. బీన్స్ పొరలో ఫ్లేవనాయిడ్స్ బలమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు.

డార్క్ చాక్లెట్ 

డార్క్ చాక్లెట్స్ లో కోకో కంటెంట్ అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వీటిని తరచూ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ లో హెల్తీ గట్ బ్యాక్టీరియాకు రాకెట్ ఇంధనం అయిన పాలీఫెనాల్స్, ఫ్లేవనోల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ తో పోరాడటంలో ఇవి తోడ్పడతాయి. రోజూ రాత్రి భోజనం తర్వాత ఒకటి లేదా రెండు స్క్వేర్ల డార్క్ చాక్లెట్ తినడం వల్ల క్యాన్సర్ కి దూరంగా ఉండచ్చు.

తృణధాన్యాలు

రోల్డ్ ఓట్స్, బ్రౌన్ రైస్, 100శాతం హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు విటమిన్ E, లిగ్నాన్స్, ఫైటిక్ యాసిడ్, ఫైబర్ వంటి ప్రొటెక్టివ్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. తృణధాన్యాలు తినడం కనీసం 18 రకాల క్యాన్సర్ల నుండి దూరంగా ఉండచ్చు.

ఆకు కూరలు

బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలలో ఉండే కెరోటినాయిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్, బ్ల్యాడర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లతో పోరాడటానికి తోడ్పడతాయి.వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. 

పులియబెట్టిన ఆహారాలు

కల్చర్డ్ లేదా పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్, రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే, క్యాన్సర్ నుండి రక్షించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అందిస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా క్యాన్సర్ కారకాలను బంధించి నాశనం చేయగలదు, ఇది కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

వెల్లుల్లి

మన పూర్వికుల కాలం నాటి నుండి వెల్లుల్లిని కూరల్లోకి మాత్రమే కాకుండా ఔషధంగా కూడా వాడుతూ వస్తున్నాం. వీటిలో అల్లిసిన్ అనే ప్రొటెక్టివ్ సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ ను నివారించడంలో బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని తరచుగా తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.