స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. 10 కార్లు దగ్ధం..

స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. 10 కార్లు దగ్ధం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని పాల్వంచ తెలంగాణ నగర్ సమీపంలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో సుమారు 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం ( ఏప్రిల్ 12 ) జరిగిన ఈ ప్రమాదంలో  స్క్రాప్ కు వేసిన కార్లను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దగ్దమైన 10 కార్లు స్క్రాప్ కి వేసినవే అని సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పాల్వంచలో ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా స్క్రాప్ దుకాణాలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. 

►ALSO READ | తిరుమల కొండపై ఇంత కంటే ఘోరం ఉంటుందా.. : మహా ద్వారం వరకు క్యూలో చెప్పులతో వచ్చిన భక్తులు

ఒక్క స్క్రాప్ దుకాణానికి కూడా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని అంటున్నారు స్థానికులు. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండటంతో స్క్రాప్ దుకాణాల యజమానులు రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.