పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యపడదు. ఇంటీరియర్‌లో చిన్నచిన్న మార్పులు చేసి, చిన్న ఇంటినే పెద్దగా కనపడేలా చేసుకోవచ్చు. చాలా మంది చిన్న గదులకు లైట్ కలర్ సూట్ అవుతుందనే అపోహలో ఉంటారు. కలర్ కాంబినేషన్‌కీ కొన్ని లెక్కలుంటాయి. వాటిని బట్టే గోడలకు రంగులు వేసుకోవాలి.
ఒక్కో గదినీ ఒక్కోలా పెయింట్ చేసుకోవాలి.బెడ్రూము వామ్ కలర్‌ను ఎంచుకోవాలి. సీలింగ్ కు పది సెంటీమీటర్ల కింద నుంచీ ఈ వామ్ కలర్స్ ను వేయాలి. ఆ వదిలేసిన ఖాళీని తెలుపురంగుతో నింపాలి. దీని వల్ల సీలింగ్ఎత్తుగా ఉన్నట్టూ, గది పొడవుగా ఉన్నట్టూ అనిపిస్తుంది.
కారిడార్ గోడలకు డార్క్ కలర్స్ వాడాలి. దీంతో స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంట్లో వాడుతున్న ఫర్నీచర్ కు దగ్గరగా ఉండే రంగులను వాడటం వల్ల ప్రశాంతమైన లుక్ ఉంటుంది. రూం కూడా పెద్దగా కనిపిస్తుంది. ఇంటికి ఉడ్‌వర్క్ చేయించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి గోడల రంగు కంటే కొద్దిగా డార్క్ గా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కూడా గది పెద్దగా అనిపిస్తుంది. వీటితో పాటుగా గోడలకు అద్దాలను పెట్టడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. దీంతో గది రెండింతలు పెద్దదిలా కనపడుతుంది.
== వెలుగు లైఫ్