- ఎల్పీజీతో పేదల జీవితాల్లో వెలుగులు
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
కంటోన్మెంట్, వెలుగు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉజ్వల పథకం కింద 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఎల్పీజీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాలకు ఎల్పీజీ అందించడంతో డిస్ట్రిబ్యూటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గ్యాస్ రంగంలో సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు చెప్పారు.