పది రోజుల్లో కూతురి పెళ్లి పెట్టుకుని.. కాబోయే అల్లుడితో అత్త లేచిపోవడం ఏంట్రా సామీ..!

పది రోజుల్లో కూతురి పెళ్లి పెట్టుకుని.. కాబోయే అల్లుడితో అత్త లేచిపోవడం ఏంట్రా సామీ..!

అలీఘర్: మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. పది రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకుని కాబోయే అల్లుడితో అత్త ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఈ మహిళ నిర్వాకం తెలిసి సభ్య సమాజం విస్తుపోయింది. కూతురు పెళ్లి కోసం దాచిన మూడున్నర లక్షల డబ్బులు, 5 లక్షల విలువ చేసే నగలతో కాబోయే అల్లుడితో అత్త జంప్ అయిందన్న వార్త నెట్టింట వైల్డ్ ఫైర్లా వ్యాపించింది. ఆమెను తిట్టనోళ్లంటూ లేరు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగర్ పరిధిలో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అలీగర్ పరిధిలోని మద్రక్ ప్రాంతంలోని మనోహర్పూర్ కయస్థ అనే గ్రామంలో జితేందర్ కుమార్ నివాసం ఉంటున్నాడు. బతుకుదెరువు నిమిత్తం జితేందర్ కుమార్ పట్నంలో పనిచేసుకుంటూ అక్కడే ఉండేవాడు. జితేందర్ భార్య అప్నా దేవి పిల్లలతో పాటు ఊళ్లోనే ఉండేది. రాహుల్ అనే యువకుడితో తన కూతురు శివానికి జితేందర్ కుమార్ పెళ్లి ఫిక్స్ చేశాడు. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉంది.

పెళ్లికి శుభలేఖలు కూడా కొట్టించారు. కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందన్న జితేందర్ సంతోషంపై అతని భార్య అప్నా దేవి నీళ్లు చల్లింది. శివానికి రాహుల్తో పెళ్లి కుదిరినప్పటి నుంచి కాబోయే అల్లుడితో అప్నా దేవి ఫోన్ సంభాషణలు సాగించింది. గంటల కొద్దీ కాల్స్ మాట్లాడింది. నిశ్చితార్థానికి, పెళ్లికి మూడు నాలుగు నెలల గ్యాప్ రావడంతో అత్తాఅల్లుడి ప్రేమాయణం పీక్స్కు చేరింది. ఈ విషయం జితేందర్ గానీ, అతని కూతురు శివాని కానీ తెలుసుకోలేకపోయారు. కుటుంబ సభ్యులు శివాని పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా అప్నా దేవి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని కుటుంబ సభ్యులు భావించారు. కానీ రాహుల్ కూడా కనిపించకపోవడంతో యవ్వారం ఏదో తేడాని ఉందని అర్థమైంది.

►ALSO READ | Air India:ఇదేం శాడిజం రా..బాబూ..విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోశాడు

రెండున్నర లక్షల డబ్బు, 5 లక్షల విలువైన నగలు కూడా జితేందర్ ఇంట్లో మాయం కావడంతో కాబోయే అల్లుడితో కలిసి అత్త ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఖాయమైంది. ఇంట్లో పది రూపాయలు కూడా మిగల్చకుండా అంతా ఊడ్చేసిందని, ఆ డబ్బు, నగలు తిరిగిచ్చి ఆమెకు నచ్చింది చేసుకోమని కూతురు చెప్పడం కొసమెరుపు. బెంగళూరులో తాను చిన్న వ్యాపారం పెట్టుకుని ఊళ్లో తన కుటుంబానికి డబ్బు పంపుతున్నానని, రూపాయి రూపాయి కూడబెట్టి కూతురి పెళ్లి కోసం డబ్బు దాస్తే ఆ డబ్బుతో కాబోయే అల్లుడితోనే తన భార్య వెళ్లిపోయిందని జితేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు జంప్ అయిపోయిన అత్త, అల్లుడు కోసం వెతుకులాట సాగిస్తున్నారు.