రాయలసీమ రైలు ఢీ కొని 10 మేకలు మృతి

బోధన్, వెలుగు: బోధన్​టౌన్​లోని బెల్లల్​రైల్వేగేట్ సమీపంలో బోధన్​నుంచి నిజామాబాద్​కు వెళ్తున్న రాయలసీమ ఎక్స్​ప్రెస్ రైలు ఢీకొని10 మేకలు మృతి చెందాయి. పట్టణానికి చెందిన ఖాదర్​రైల్వేగేట్ ​సమీపంలో మేకలను మేపుతుండగా అదే టైమ్​లో వచ్చిన రైలు ఢీకొని మేకలు మృతి చెందినట్లు బాధితుడు తెలిపాడు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు చెప్పాడు.