న్యూఢిల్లీ : బంగారం ధరలు శుక్రవారం రికార్డ్ గరిష్టాన్ని టచ్ చేశాయి. 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.79,900 కు చేరుకుంది. రూ.80 వేల మార్క్‌కు కేవలం రూ. వంద దూరంలో ట్రేడవుతోంది. పండుగ టైమ్‌లో డిమాండ్ పెరగడంతో పాటు మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న టెన్షన్ల వలన గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
10 గ్రాముల గోల్డ్ ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.550 పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. కేజీ వెండి ధర శుక్రవారం రూ.1,000 పెరిగి రూ.94,500 కి పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ (99.9 శాతం ప్యూరిటీ) ధర శుక్రవారం రూ.870 పెరిగి రూ.78,980 కి చేరుకుంది.