10 గ్రాముల గోల్డ్​ రూ.2 లక్షలకు?

  •  తొమ్మిదేండ్లలో చేరుకుంటుందన్న ఎనలిస్టులు
  • రూపాయి విలువ తగ్గడం, జియో పొలిటికల్ టెన్షన్లు, డిమాండ్ పెరుగుతుండడంతో ధరలు పైకి
  • ఆరేళ్లలోనే  గోల్డ్ ధర మూడు రెట్లు పెరుగుతుందన్న ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్

న్యూఢిల్లీ: పది గ్రాముల గోల్డ్ ధర  ఇంకో తొమ్మిదేండ్లలో రూ.2 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుందా? అంటే కేజీ గోల్డ్ ధర రూ.2 కోట్లకు చేరుకుంటుందా? హిస్టరీ చూస్తే గోల్డ్ రేటు ప్రతీ 9 ఏళ్లకు మూడు రెట్లు పెరగడాన్ని గమనించొచ్చు. అంటే ప్రస్తుతం రూ. 70 వేల చిల్లర ఉన్న 10 గ్రాముల గోల్డ్ 2033 నాటికి  మూడింతలు పెరిగి రూ.2.1 లక్షలకు చేరుకోవచ్చు. 2015 లో రూ.24,740 ఉన్న 10 గ్రాముల బంగారం ధర 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌023 నాటికి మూడు రెట్లు పెరిగింది.

 అంతకు ముందు 9 ఏళ్లలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. 2006 లో 10 గ్రాముల గోల్డ్ రేటు     రూ.8,250 పలికింది. ఇంకా ముందుకెళితే  బంగారం ధర మూడు రెట్లు పెరగడానికి 19 ఏళ్లు పట్టింది. 1987 లో   10 గ్రాముల గోల్డ్ రేట్‌‌‌‌‌‌‌‌ రూ.2,570 గా ఉంది. దీనికంటే ముందు 8 ఏళ్లలో గోల్డ్ ధర మూడు రెట్లు పెరగడం చూడొచ్చు. అంతకు ముందు ఆరేళ్లలో కూడా బంగారం ధర మూడింతలు పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో 9 ఏళ్లలో రూ.10 గ్రాముల బంగారం రేటు రూ.2 లక్షల మార్క్ టచ్ చేయొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.

రూ.2 లక్షలకు చేరాలంటే?

గత ఐదేళ్లలో గోల్డ్‌‌‌‌‌‌‌‌ ధర భారీగా పెరగడానికి  కారణం జియో పొలిటికల్ టెన్షన్లే.  కరోనా సంక్షోభం, డాలర్ మారకంలో రూపాయి బలహీన పడడం, వివిధ దేశాల మధ్య యుద్ధాలతో బంగారం ధర కేవలం 3.3 ఏళ్లలోనే 75 శాతం పెరిగింది. 2014–18 మధ్య 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.28 వేల నుంచి 12 శాతం పెరిగి రూ.31,250 కి చేరుకుంది. ‘హిస్టారికల్ డేటా చూస్తే  జియోపొలిటికల్ టెన్షన్లు, ఆర్థిక సంక్షోభం వంటి  కీలకమైన గ్లోబల్‌‌‌‌‌‌‌‌ అంశాలు  గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

 ఫలితంగా తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే  ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత  5 ఏళ్లలో రూపాయి బలహీనమయ్యింది. జియో పొలిటికల్ టెన్షన్లు, యుద్ధాలు, కరోనా సంక్షోభం నెలకొన్నాయి. దీంతో  10 గ్రాముల బంగారం ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెరిగింది. కేవలం 3.3 ఏళ్లలోనే 75 శాతం వృద్ధి చెందింది. 10 గ్రాముల బంగారం ధర రానున్న 7–12 ఏళ్లలో రూ.2 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌ టచ్ చేసే అవకాశం ఉంది’ అని ఎల్‌‌‌‌‌‌‌‌కేపీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్ జటిన్ త్రివేది అంచనా వేశారు. 

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ నేషనల్ సెక్రెటరీ సురేంద్ర మెహతా పది గ్రాముల గోల్డ్‌‌‌‌‌‌‌‌ రేటు రూ.2 లక్షల టచ్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌, ఇజ్రాయిల్ మధ్య ముదురుతున్న గొడవ, చైనా–తైవాన్ మధ్య నెలకొన్న టెన్షన్స్‌‌‌‌‌‌‌‌తో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనిశ్చితి పెరుగుతుందని పేర్కొన్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌జీఈ, కామెక్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ ట్రేడింగ్ పెరగడంతో కూడా బంగారం ధరలు వచ్చే ఆరేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేశారు. మరోవైపు రష్యా, చైనా, ఇండియా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో తమ గోల్డ్ నిల్వలను పెంచుకుంటున్నాయి. ఫలితంగా గోల్డ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ పెరుగుతోందని, ధరలు పెరగడానికి ఇదొక కారణమని ఎనలిస్టులు పేర్కొన్నారు.