కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి అని ఎందుకు అంటారు.. ఎందుకు ఆ వెంకన్న ప్రత్యక్ష నారాయణుడు అయ్యారు.. వైకుంఠ ఏకాదశి..ఈ పర్వదినం రోజున..తిరుమల వెంకన్న 10 మహిమలను తెలుసుకుందాం..
వేంకటేశ్వరస్వామి విగ్రహానికి జుట్టు :
తిరుమల వేంకటేశ్వరస్వామి మూల విరాట్ విగ్రహానికి..వెంకన్న తలకు జుట్టు ఉంటుందని చెబుతారు పండితులు.ఈ జుట్టు ఎప్పుడూ చిక్కుపడదు..ఎంతో మృదువుగా ఉంటుంది. వేంకటేశ్వ రస్వామి ఇక్కడ నివాసం ఉంటున్నారు..సజీవంగా జీవిస్తున్నారు అనటానికి ఇదే నిదర్శనం అని భక్తులు నమ్ముతారు. మూల విరాట్ కు పూజలు చేసే పండితులు కూడా ఇదే చెబుతారు.
సముద్రపు అలల శబ్దం
స్వామి వారి మూల విరాట్ విగ్రహం భుజ కీర్తుల వద్ద , వీపు భాగంలో ఎప్పుడూ తడిగానే ఉంటుందని.. ఆ ప్రదేశంలో సముద్ర గోషా వినపడుతుందని అంటుంటారు పండితులు. అంతే కాదు స్వామి వారి వెనక భాగంలో పెద్ద సొరంత మార్గం కూడా ఉంటుందట. ఆ సొరంగ మార్గం ద్వారా పూలను వేస్తుంటాని అంటుంటారు.
అద్భుతమైన కర్ర
తిరుమలలో ఆలయ ప్రధాన ద్వారం కుడి వైపున ఓ కర్ర ఉంటుంది. భగవంతుడైన బాలాజీని తన చిన్నతనంలో ఈ కర్రతో కొట్టారని.. దాని కారణంగా అతని గడ్డం గాయపడిందని చెబుతారు. ఈ కారణంగా నాటి నుంచి నేటి వరకు ప్రతి శుక్రవారం గంధపు పేస్ట్ ను లార్డ్ బాలాజీ గడ్డం మీద పూయడం వల్ల ఆయన గాయం మానుతుందని చెబుతుంటారు.
ఎప్పటికీ వెలిగే దీపాలు
తిరుమలలో లార్డ్ బాలాజీ ఆలయంలో ఎల్లప్పుడు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ దీపంలో ఎప్పుడూ నూనె గానీ, నెయ్యి గానీ పోయరు. ఏళ్ల తరబడి వెలుగుతున్న ఈ దీపాన్ని ఎవరు ఎప్పుడు వెలిగిస్తారో ఎవరికీ తెలియదు.
విగ్రహం మధ్యలో లేదా కుడి వైపున ఉంటుంది
తిరుమల ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. బాలాజీ గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు గర్భగుడి మధ్యలో విగ్రహం ఉన్నట్లు కనిపిస్తుంది. గర్భగుడి నుండి బయటకు వచ్చి చూస్తే విగ్రహం కుడి వైపున ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.
పచ్చి కర్పూరం
లార్డ్ బాలాజీ విగ్రహానికి ప్రత్యేకమైన పచ్చి కర్పూరం పూస్తారు. ఏదైనా రాయికి ఈ పచ్చి కర్పూరం పూస్తే కొంత సమయం తర్వాత పగుళ్లు వస్తాయని శాస్త్రీయ అభిప్రాయం ఉంది. అయినా లార్డ్ బాలాజీ మహిమల వల్లే విగ్రహాన్ని ప్రభావితం చేయదని భక్తుల నమ్మకం.
గంధపు ముద్దను గురువారం పూయాలి
లక్ష్మీదేవి బాలాజీ హృదయంలో నివసిస్తుందని భక్తుల నమ్మకం. ఇది తిరుమల ప్రతి గురువారం బాలాజీకి పూసే గంధం తెలియజేస్తుంది. ప్రతి గురువారం బాలాజీని అలంకారం నుండి పూర్తిగా తొలగించి స్నానం చేసి, గంధం పూసినప్పుడు అమ్మవారి ఉనికి వెల్లడి అవుతుంది. గంధపు ముద్దను తీసివేస్తే, గుండెకు పూసిన చందనంలో లక్ష్మీ దేవి చిత్రం కనిపిస్తుందట.
కింద ధోతీ, పైన చీర
ప్రతిరోజు భగవంతుని విగ్రహాన్ని కింద ధోతీ, పైన చీరతో అలంకరిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి రూపం బాలాజీలోనే ఉందని నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా స్వామివారితోపాటు అమ్మవారిని సేవించినట్లు పూజారులు, భక్తు లునమ్ముతారు.
ప్రత్యేకమైన గ్రామం
లార్డ్ బాలాజీ కి అలంకరించే పూలకోసం ఏకంగా ఓ ప్రత్యేక గ్రామమే ఉంది. ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. బయటి వ్యక్తులు ఎవరికీ ఇక్కడికి ప్రవే శం ఉండదు. ఇక్కడి ప్రజలు జీవనం ఎంతో క్రమశిక్షణతో సాగుతుందట. ఈ గ్రామంలో మహిళలు కుట్టిన బట్టలు ధరించరు.బాలాజీకి నైవేద్యంగా పెట్టే పండ్లు, పూలు, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ ఇక్కడి నుంచే వస్తాయని చెబుతుంటారు.
పూర్తి సజీవంగా ఉన్న విగ్రహానికి చెమటలు
తిరుమలలో లార్డ్ బాలాజీ అనేక మహిమలు ఉన్నాయని పూజరులు చెబుతుంటారు.. వీటిలో లార్డ్ బాలాజీ విగ్రహం ప్రత్యేకమైన మృదువైన రాతితో ఉన్నప్పటికీ..ఇది పూర్తి సజీవంగా ఉంటుందట. ఆలయ పరిసరాలు ఇక్కడ చాలా చల్లగా ఉంటాయి. అయినప్పటికీ బాలాజీ తన శరీరంపై వేడి, చెమట చుక్కలు కనిపిస్తాయని, లార్డ్ బాలాజీ వెనుకభాగం కూడా తేమగా తఉందని నమ్ముతారు.