ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్ లో కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నసత్రం ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి విద్యా పథకం ద్వారా ఆదివారం 120 మంది నిరుపేద స్టూడెంట్స్ ఉన్నత విద్యకు గాను రూ.10 లక్షల విలువైన చెక్కులను వాసవి గార్డెన్స్ అధ్యక్ష, కార్యదర్శులు చెరుకూరి కృష్ణమూర్తి, చిన్ని కృష్ణారావు అందజేశారు.
80 మంది స్టూడెంట్స్ కు రూ.10 వేల చొప్పున, మరో 40 మందికి రూ.5 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేసినట్లు కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కురివేళ్ల లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షులు కడవెండి శ్రీనివాస్, పసుమర్తి సాంబశివరావు, వేములపల్లి నగేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వరరావు, చెరుకూరి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.