2026 నాటికల్లా ఈ రంగంలో10లక్షలు జాబ్స్

2026 నాటికల్లా ఈ రంగంలో10లక్షలు జాబ్స్

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఈ కొత్త టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. అందుకే ఈకామర్స్‌ సంస్థలు మొదలు సోషల్‌ మీడియా సైట్స్‌ వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. రానున్న రోజుల్లో ఈ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిన్న జరిగిన ఏఐ సెలబ్రేటింగ్‌ ది ఫ్యూచర్‌ కార్యక్రమంలో టీసీఎస్‌ ప్రెసిడెంట్ వి. రాజన్న పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు మాట్లాడారు.

బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌), ఎస్‌టీపీఐ (సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) ఉమ్మడిగా 31వ నేషనల్‌ సమిట్‌ అవార్డ్స్‌ సదస్సును  పేరిట నిర్వహించాయి. వరల్డ్ వైడ్ గా ఏఐ ఆర్థిక వ్యవస్థ ఏటా 39.4% వృద్ధి సాధిస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా ఏఐ అభివృద్ధిలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నీతి ఆయోగ్‌ ప్రత్యేకంగా ‘అందరికీ ఏఐ’ పేరుతో ప్రత్యేక పథకాన్నీ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.
2026 నాటికి భారత దేశంలో ఏఐ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని రాజన్న చెప్పారు. భవిష్యత్ లో ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఏఐని ఎక్కువగా ఉపయోగించుకుంటాయని, మేడారం జాతర కూడా తెలంగాణ పోలీసులు ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవలు ఇలా అన్ని రంగాల్లో ఏఐ వస్తుందని జోస్యం చెప్పారు. టెక్‌ మహీంద్రా ఎండీ సీసీ గుర్నాని మాట్లాడుతూ.. ఏఐని ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని సత్య నాదెళ్ల మాటలు గుర్తు చేశారు.

Also Read: రాజధాని ఢిల్లీ రోడ్డుపై పెద్ద గొయ్యి..