10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు

10 లక్షల కేసులు.. 51 వేల మరణాలు

ఒక్క యూరప్లోనే 5 లక్షలకుపైగా కేసులు
ఇటలీలో 13 వేలు, స్పెయిన్లో 10 వేలకు పైగా మరణాలు
స్పెయిన్లో 24 గంటల్లో 950 మంది మృతి

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ సంఖ్య రానురాను పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య 51 వేలను దాటింది. నిమిషం నిమిషానికీ ఈ సంఖ్య ఎక్కువ అవుతోంది. మరోవైపు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా యూరప్ దేశాల్లోనే నమోదయ్యాయి. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వారి సంఖ్య అక్కడ 5 లక్షలు దాటింది. 35 వేలకు పైగా మరణాలు యూరప్‌‌‌‌లో నమోదయ్యాయి. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఇటలీ 13 వేలకు పైగా మరణాలతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా, 10 వేల డెత్ లతో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాల్లోనూ పాజిటివ్ కేసులు లక్ష దాటాయి.

స్పెయిన్లోమరణాలు10 వేలు దాటినయ్
ఇటలీ తర్వాత అత్యంత ఎఫెక్ట్ అయిన దేశం స్పెయిన్. అక్కడ కరోనా మరణాలు 10 వేలు దాటాయి. గురువారం వరకు తమ దేశంలో
కనీసం 10,003 మంది చనిపోయినట్లు హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. మొత్తంగా 1.1 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపింది. బుధ, గురు
వారాల్లో కేవలం 24 గంటల వ్యవధిలో 950 మందికి పైగా మృతి చెందినట్లు చెప్పింది. ఒకే ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే
తొలిసారి అని చెప్పింది. కరోనా వల్ల ప్రపంచంలో అత్యంత ఘోరంగా దెబ్బతిన్న దేశాల్లో స్పెయిన్ కూడా ఒకటి.

బెల్జియంలో వెయ్యి దాటిన మరణాలు
బెల్జియంలో కరోనా డెత్ ల సంఖ్య వెయ్యి దాటింది. 1,011 మంది చనిపోగా, 15,348 కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.
మృతుల్లో 93 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వాళ్లేనని చెప్పారు.

స్వీడన్లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నరు..
ఒకవైపు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. స్వీడన్ ప్రజలు మాత్రం అవేమీ పట్టనట్లు ఉన్నారు. వీధుల్లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు మొత్తుకుంటున్నా వినకుండా షాపింగ్ మాల్స్, హోటళ్లకు వెళ్తున్నారు. బార్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ 5 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 230 మంది వరకు చనిపోయారు.

మరిన్ని…
సింగపూర్లో నాలుగో డెత్ నమోదైంది. ఇండోనేసియాకు చెందిన 68 ఏళ్ల వ్యక్తి కొవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాడని ఆ దేశ హెల్త్ మినిస్ర్టీ తెలిపింది.
స్పెయిన్లో ఒక్క మార్చిలోనే 302,265 మంది తమకు జాబ్ లేదని రిజిస్టర్ చేసుకున్నారు.
కరోనావైరస్ మహమ్మారి ‘మానవత్వానికి, అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పు” అని పేర్కొంటూ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలని ట్యునీషియా ప్రతిపాదించింది.
కరోనా టెస్టులను భారీగా పెంచుతామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. వైరస్ స్క్రీనింగ్ విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు
రావడంతో ఈ కామెంట్స్ చేశారు. మార్చి 27 నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న జాన్సన్.. వీడియో రిలీజ్ చేశారు.
రెండు పొటెన్షియల్ కొవిడ్-19 వ్యాక్సిన్ల టెస్టింగ్ను ప్రారంభించినట్లు ఆస్ర్టేలియా సైంటిస్టులు తెలిపారు.

ఇజ్రాయెల్ హెల్త్ మినిస్టర్కు..
ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాల్సిన హెల్త్ మినిస్టర్కే ఇజ్రాయెల్లో కరోనా వచ్చింది. ఆరోగ్య మంత్రి యాకోవ్ లిట్జ్మన్, ఆయనభార్యకు వైరస్ సోకింది. దీంతోవాళ్లు ఐసోలేషన్లో ఉన్నారు. ఈ మధ్య యాకోవ్.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారని ఆఫీసర్లు తెలిపారు.ఈక్రమంలో నెతన్యాహు హోం ఐసోలేషన్లో ఉన్నారు.

For More News..

దేశంలో 42 కరోనా హాట్ స్పాట్లు